Brahmamudi: కాపురాలు కూల్చే మీరుండగా అలాంటి ఆశలు పెట్టుకుంటానా.. అవార్డు కోసం పోటీ!
on Oct 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-530 లో.. రాజ్, సుభాష్, రుద్రాణి ఎక్స్ పో కోసం వస్తారు. ఇక అదే సమయంలో కావ్య కూడా వస్తుంది. ఇక కావ్యని చూసిన సుభాష్.. ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తాడు. ఎలా ఉంటుంది అన్నయ్యా.. కారులు పోయి కాలి నడకన వస్తుంది కదా అన్నయ్య.. రాతల రాజ్యాలను ఏలుతుంటే.. బుద్ధులు బూడిద గుప్పల మీదే ఉంటే ఎవరు ఏం చేస్తారని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మీ గురించి మీరు ఎవరికి చెబుతున్నారని స్వప్న అంటుంది. కావ్య పదమ్మా అని సుభాష్ అనగానే.. ఎవరు పిలిచారంటా అని రాజ్ అంటాడు. ఈ బిల్డింగ్ ఎప్పుడు కొన్నారంటా అని కావ్య అనేసి.. తన అక్క స్వప్నతో మాట్లాడుతుంది. ఈ వంకతో మాటి మాటికి ఎదురుపడి మా రాజ్ మనసు మార్చెయ్యాలని చూస్తున్నావేమో.. వాడు ఎప్పటికి నిన్ను క్షమించే ప్రసక్తే లేదని రుద్రాణి అంటుంది. మీ ఆయన నిన్ను ఇప్పటికి క్షమించకుండా వదిలేసినట్లు.. అందరి కాపురాలు అలానే ఉంటాయా అత్తా అని స్వప్న అంటుంది.
రాజ్ ఇది నాకు చాలా అవమానంగా ఉంది.. ఈ ఎక్స్‌పోలో పెద్దపెద్ద కంపెనీలు పోటీ పడతాయి అనుకున్నాను.. కుండలకు రంగులు వేసే వాళ్లు కూడా వస్తే ఎలా రాజ్ అని రుద్రాణి అంటుంది. స్థాయిని నిర్ణయించేది కుండలు.. కారులు కాదు.. రుద్రాణి గారు.. కళ మాత్రమే అని కావ్య అంటుంది. అలా అని కుండలు కొండలతో ఢీ కొంటే మాత్రం పగిలేది కుండలే అని రుద్రాణి అనగానే.. ఇప్పుడు ఎవ్వరు ఎవరితో ఢీ కొనడానికి రాలేదని కావ్య అంటుంది. మరి ఇంటికి రమ్మంటే రాని వాళ్లు ఇక్కడికి ఎందుకొచ్చినట్లో అని రాజ్ అనగానే.. ఇంటికి రావడానికి నెలకు ఇంత అని ఖరీదు కట్టేవారు ఇక్కడ ఉండరనుకున్నాను.. తమరు వస్తారని నాకేం తెలుసని కావ్య అంటుంది. హేయ్ నీ కళను గుర్తించిందే నేను.. నిన్ను డిజైనర్‌ని చేసిందే నేను అని రాజ్ అనగానే.. మరి నాకు కళను నేర్పించింది కూడా మీరేనా అని కావ్య అంటుంది.
కావ్య మాటలకు కాస్త జాలిగా చూస్తాడు రాజ్. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఇవన్నీ నాటకాలు రాజ్.. ఎలాగో ఎక్స్‌పోకి అందరం వస్తామనుకుని ఉంటుంది. మా అమ్మ, మీ అమ్మ కలిసి కావ్యను ఇంటికి తీసుకుని వెళ్తారని ఆశపడి ఉంటుందని రుద్రాణి అంటుంది. కాపురాలు కూల్చే మీరు ఉండగా అలాంటి ఆశలు పెట్టుకుంటానా రుద్రాణి గారు అని కావ్య అంటుంది. ఎప్పటికి ఆ పొగరు తగ్గదు.. మనం వెళ్దాం పదండి అని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్వప్న, రుద్రాణీ కూడా వెళ్తారు. ఎలా ఉన్నావమ్మా అని కావ్యతో సుభాష్ అంటాడు. కాసేపు కావ్య, సుభాష్ మాట్లాడుకుంటారు. రాజ్, రుద్రాణి, స్వప్న నడిచి వెళ్తుంటే.. అనామిక, సామంత్ ఎదురుపడతారు. నువ్వేంటి అనామికా ఇక్కడా.. నాకు తెలిసి నీకే కంపెనీ లేదే అని రుద్రాణి అంటుంది. ఒకప్పుడు నాకంటు ఏం లేదు కానీ సామంత్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యాక కంపెనీలో షేర్ ఇచ్చాడని అనామిక అనగానే రాజ్ షాక్ అవుతాడు.
అనామిక నా బిజినెస్ పార్టనరే కాదు.. నా జీవిత భాగస్వామి కూడా కాబోతుంది సర్ అని సామంత్ అంటాడు. అది చూస్తే తెలిసిపోతుందిలే.. వందేళ్ల చరిత్ర ఉన్న మా కంపెనీకి రాకుండా మీకు ఎలా అవార్డ్ వస్తుందో అది చూద్దామని రుద్రాణి అనగానే ఊరికే చూస్తే సరిపోదు. మాకు అవార్డ్ వస్తే మాత్రం మీరంతా చప్పట్లు కొట్టాలని అనామిక అంటుంది. తప్పకుండా కొడతాం.. దుగ్గిరాల వారి మీద కోపంతో అనామిక ఇంతగా దిగజారిపోయినందుకు తప్పకుండా చప్పట్లు కొడతామని స్వప్న అనగానే.. చురకలు వేయడానికి నువ్వు ఉన్నావని మరిచిపోయాను స్వప్నా.. నన్ను ఇంట్లోంచి పంపించేసినట్లే మీ కావ్యను కూడా ఇంట్లోంచి పంపించేశారట కదా.. తర్వాత లైన్‌లో నువ్వే ఉన్నావ్.. కాస్త జాగ్రత్తగా ఉండమని అనామిక అంటుంది. కళ్యాణ్ నీకు విడాకులు ఇచ్చి జైలుకి పంపించి మరీ వదిలించుకున్నాడు.. నీకు కావ్యకు పోలికేంటీ.. వీడికి ఏదో కంపెనీ ఉందని వీడితో చేరిపోయావ్.. పాపం వీడ్ని చూస్తే జాలేస్తుంది. నువ్వు అడుగుపెట్టగానే.. ఆ కంపెనీ దివాలా తీస్తుందని.. ఆ వెంటనే నువ్వు ఇంకొకడ్ని చూసుకుంటావని పాపం ఇతడికి ఏం తెలుసని స్వప్న అంటుంది. ఆ ఇంట్లో అంతా ఇంతేనా.. ఇంత అహకారంతో ఉంటారా అని సామంత్ అంటాడు. బీ కూల్ అని సామంత్ ని అనామిక తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read